హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్ గోడౌన్ లో మంటలు చెలరేగాయి. అంతకంతకూ మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలముకుంది. ఎటుచూసినా నల్లగా కమ్మేసింది.
గోదాంలో భారీ శబ్దాలు వస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిప్రమాద విషయం తెలిసి ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. మంటల ధాటికి లోపలికి వెళ్లే వీలు లేకపోవడంతో జేసీబీ సాయంతో గోడలను కూల్చివేసి మంటలను అదుపు చేస్తున్నారు.