ఢిల్లీ: పోలవరం పనులను రీటెండరింగ్ ద్వారానే కొనసాగిస్తామని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. దీనికోసం త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని తెలిపారు. అనుకున్న సమయంలోనే ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేస్తుందని చెప్పారు. దిల్లీలో నిర్వహించిన జల జీవన్ మిషన్ కార్యక్రమంలో పెద్దిరెడ్డి పాల్గొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణ పనులను కేంద్రానికి ఇచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేదని చెప్పారు. ప్రతి ఇంటికీ నీరందించాలనే సంకల్పాన్ని కేంద్ర మంత్రి వివరించారని, దీనిపై సెప్టెంబరులో టెండ్లర్లు పిలవబోతున్నామని తెలిపారు. త్వరితగతిన ప్రతి ఇంటికి నీరందించేందుకు చర్యలు తీసుకోబోతున్నట్టు వెల్లడించారు