రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా చాలా వరకు సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ విషయంలో మాత్రం అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని… పెన్ స్టూడియోస్ ఓ క్లారిఫికేషన్ ను ఇచ్చింది.
థియేటర్లను దృష్టిలో పెట్టుకునే తీసిన ట్రిపుల్ ఆర్ ను ఓటీటీలో విడుదల చేసే ప్రసక్తే లేదని పుకార్లను నమ్మవద్దని తెలిపింది. అలియాభట్ నాయికగా నటించిన గంగూభాయ్ కతియవాడి, జాన్ అబ్రహం ఎటాక్ చిత్రాలను సైతం థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని స్పష్టం చేసింది. థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసమే ఈ మేగ్నమ్ ఓపస్ మూవీస్ ను నిర్మించామని..అందుకే థియేటర్లలో కంటే ముందు ఓటీటీలో స్ట్రీమింగ్ చేసే ప్రసక్తే లేదని పెన్ స్టూడియోస్ అధినేత జయంతీలాల్ గడా అన్నారు.