స్టార్ హీరోల సినిమాల్లో ప్రతి పాటకు ఓ సిగ్నేచర్ స్టెప్ ఉంటుంది. కొద్దిసేపటి కిందట విడుదలైన పెన్నీ సాంగ్ కు కూడా ఓ సిగ్నేచర్ స్టెప్ ఉంది. ఇందులో విశేషం ఏం లేదు. కాకపోతే ఆ సిగ్నచర్ స్టెప్ ను మహేష్ తోపాటు ఆయన కూతురు సితార వేస్తే ఎలా ఉంటుంది? ఈరోజు రిలీజైన సర్కారువారి పాట సెకెండ్ సింగిల్ పెన్నీ సాంగ్ లో మెయిన్ ఎట్రాక్షన్ ఇదే.
సర్కారువారి పాట సినిమా నుంచి సెకెండ్ సింగిల్ రిలీజైంది. అనంతశ్రీరామ్ రాసిన ఈ పాటను తమన్ కంపోజ్ చేశాడు. ఈ పాటలో మహేష్ కూతురు సితార మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పెన్నీ సిగ్నేచర్ మూమెంట్ ను చక్కగా వేసింది. సితారతో పాటు మధ్యమధ్యలో తమన్ కూడా డాన్స్ చేసి అందర్నీ ఆకర్షించాడు.
సర్కారువారి పాట సినిమాలో ఇది మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్. భారీ సెట్ లో ఈ సాంగ్ ను పిక్చరైజ్ చేశారు. మహేష్ ఎప్పట్లానే తన లుక్స్ తో అదరగొట్టాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సినిమా నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. థమన్ చక్కటి బాణీలు
అందించాడు. పెన్నీ సాంగ్ వినగానే ఎక్కేలా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. పరశురామ్ దర్శకుడు.