ఢిల్లీలో ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు వర్క్ ఫ్రమ్ హోం చేయాలని, కార్ పూలింగ్ విధానాన్ని ఉపయోగించుకోవాలని ఆదేశించింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ తీవ్రమైన కాలుష్య కేటగిరిలోకి పడిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ సబ్‌కమిటీ సమావేశాన్ని నిర్వహించింది.
వాయు నాణ్యత సూచీ పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. నూతన సంవత్సరం వేళ ఆదివారం ఢిల్లీ, దేశ రాజధాని పరిధిలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోయే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ఈ క్రమంలో భవన నిర్మాణ, కూల్చివేత పనులను నిలిపివేతకు అధికారులు ఆదేశించింది.
ఏక్యూఐని దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించింది. లేదంటే కార్ పూర్ సౌకర్యాన్ని ఉపయోగించాలని సూచనలు చేసింది. ఇక బీఎస్ 3 పెట్రోల్, బీఎస్4 డీజిల్ ఫోర్-వీలర్ల వినియోగంపై నిషేధాలు విధించే విషయంపై ఈ రోజు అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
కాలుష్యరహిత కార్యకలాపాలైన ప్లంబింగ్, కార్పెంటరీ, ఎలక్ట్రికల్ పనులు, ఇంటీరియర్ డెకరేషన్ లాంటి వాటికి అనుమతులు ఇచ్చింది.ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతంలో బొగ్గు,అనుమతి లేని ఇంధనాలను ఉపయోగించే పరిశ్రమలను జనవరి 1 నుంచి మూసివేస్తామని ఇప్పటికే వాయు నాణ్యత కమిటీ తెలిపింది.