కేసీఆర్ అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ.. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఈ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని.. బ్యాలెట్ పేపర్ లో ప్రజలే జవాబు ఇస్తారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ మీటర్లు పెడుతోందని తప్పుడు ప్రచారం చేయడానికి సిగ్గుండాలని తీవ్ర విమర్శలు చేశారు.
రారైస్ కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారని గుర్తు చేశారు. రైతాంగాన్ని తెలంగాణ ప్రభుత్వం నష్టాలపాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రగతి భవన్ విద్యుత్ బిల్లులు కట్టారా..? అని ప్రశ్నించారు.
అంతర్జాతీయంగా కృడాయిల్ ధరల ఆధారంగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం జరిగిందన్నారు. పాలన చేతగాని కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని జితేందర్ రెడ్డి అన్నారు.