కాంగ్రెస్ కు కపిల్ సిబాల్ రాజీనామా చేయడంపై ఆ పార్టీ స్పందించింది. పార్టీలోకి ఎంతో మంది నాయకులు వస్తుంటారు.. పోతుంటారని, వారి నిర్ణయాల్లో ఎవరినీ తప్పుపట్టలేమని పార్టీ జనరల్ సెక్రటరీ కే.సీ.వేణుగోపాల్ అన్నారు.
పార్టీ అధ్యక్షురాలికి కపిల్ సిబాల్ లేఖ రాశారని వేణుగోపాల్ తెలిపారు. కాంగ్రెస్ విలువలను తాను గట్టిగా నమ్ముతానని లేఖలో సిబాల్ పేర్కొన్నారని ఆయన తెలిపారు. అంతకు మించి సిబాల్ వేరే ఏం మాట్లాడలేదన్నారు. ముందు కపిల్ ఆయన వైఖరిని తెలియజేయనివ్వండని, ఆ తర్వాత తాను స్పందిస్తానని చెప్పారు.
కాంగ్రెస్ అనేది ఒక పెద్ద జాతీయ పార్టీ అన్నారు. అందులోకి ఎందరో వస్తుంటారు, మరెందరో వెళ్లిపోతుంటారని పేర్కొన్నారు. పార్టీని వీడిన వారిని తాము నిదించబోమని స్పష్టం చేశారు
పార్టీని పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. పార్టీలో త్వరలో చాలా మార్గదర్శకాలు రానున్నాయని వివరించారు. ప్రతి వ్యక్తిపై ఒక బాధ్యత ఉంటుందని వెల్లడించారు.