సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామంలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. తుర్కపల్లికి చెందిన ఈడిగ హనుమ గౌడ్ అనే వ్యక్తికి చెందిన వ్యవసాయ భూమిలో ఉన్న రెండు వేపచెట్లకు కొంతకాలంగా కల్లును పోలిన పదార్థం బయటికి వస్తుంది. అది వేప కల్లు అంటూ స్థానికులు దాని రుచి చూసేందుకు ఎగబడుతున్నారు. వేప కల్లును తాగిన వారంతా తమను దీర్ఘకాలికంగా వేధిస్తున్న కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభించిందని తెలిపారు.
అయితే ఈ విషయంపై శాస్త్రవేత్తలు స్పందించారు. వేపచెట్టుకు కారుతున్న పదార్థాన్ని తీసుకోవద్దని సూచిస్తున్నారు. వేపచెట్టు అనారోగ్యానికి గురి అయినప్పుడు నురగ లాంటి పదార్థం వస్తుందని దానిని సేవించవద్దని సూచిస్తున్నారు.