ప్రపంచాన్ని కరోనా కమ్మేస్తుంటే, కొండపోచమ్మ ప్రాంతంలో బహిలింపుర్, మామిడ్యాల, తనేదార్ పల్లి గ్రామాలను హై కోర్ట్ ఆదేశాలకు విరుద్ధంగా కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి ఆద్వర్యంలో కూల్చివేతలు చేపడుతున్నారు. ఉన్నపళంగా ఇండ్లను కూల్చి రైతుల బతుకులు బజారుపాలు చేస్తున్నారు..
ఒక పక్క లాక్ డౌన్ ఎవరు బయటకు రావొద్దు అంటున్న ప్రభుత్వం మరోపక్క గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలి అని హుకుం జరిచేస్తుంది. ఇంట్లో నుంచి బయటకు వస్తే కేసులు పెడుతున్న అధికారులు ఆ గ్రామ ప్రజలను మాత్రం రోడ్డున పడేస్తున్నారు. సీఎం సొంత జలాల్లో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తీరు విమర్శలకు దారితీస్తుంది. కొండ పోచమ్మ ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాల ప్రజలకు వేరే చోట నివాసాలు ఏర్పాటు చేసాక ఆ గ్రామాలను ఖాళీ చేయించాలి అని కోర్టు చెప్పిన కలెక్టర్ మాత్రం ఆఘమేఘాలపై గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారు. కరోనా భయం తో ఉన్న ప్రజలు ఇప్పుడు ఇండ్లు కూల్చివేస్తే ఎక్కడికి వెళ్ళాలి అని బాధపడుతున్నారు.