కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మనుషుల మధ్య దూరం పాటిస్తూ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండాలని, అధికారులు, ప్రజాప్రతినిదులు కోరుతుంటే మహబూబబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగరం శివారు గాజుల కుంట చెరువులో చేపలు పాట్టేందుకు సుమారు 300 వందల ఒకే సారి చెరువు దగ్గరకు చేరుకొని చేపలు పడుతున్న దృశ్యాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 5 గురు కంటే ఎక్కువ గుమికుడొద్దని నిబంధన విధించిందినప్పటికీ ఆ నిబంధనను తుంగలో తొక్కి గుంపులుగా చేపలు పట్టు తొండటం తో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా జరుగుతున్న పోలీసులు ఎక్కడా కనిపించకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో గ్రామస్థులు ఉన్నారు.