టీఆర్ఎస్ ఇక నుండి ఫక్తు రాజకీయ పార్టీగా పనిచేస్తుంది అని కేసీఅర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రకటించారు. ఇకనుండి తమది ఉద్యమ పార్టీ కాదు అని తేల్చి చెప్పాడు. అది చాలామందికి తెలియక ఇంకా టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అనుకుని కేసీఅర్ ఇలా చేస్తాడా, అలా చేస్తాడా ..ఉద్యమ పార్టీ అయి ఉండి ఇలా చేయడం అన్యాయం అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ప్రజలలో ఇలాంటి భ్రమలు ఉంటాయనే తెలంగాణ రాగానే కేసీఅర్ మాది ఇకనుండి ఫక్తు రాజకీయ పార్టి అని ప్రకటించాడు. తెలంగాణ వస్తే మా బతుకులు మారతాయని భావించిన వర్గాలకు నిరాశే మిగిలింది అంటున్నారు. తెలంగాణ వచ్చాక ఎలా ఉండాలో ఏమి చేయాలో కేసీఅర్ కి క్లారిటీ ఉంది కాని ప్రజలకులేకపోవడమే సమస్య అంటున్నారు. కేసీఆర్‌ని ప్రజలు ఒకరకంగా ఊహిస్తే కేసీఆర్ మాత్రం తాను అనుకున్నది చేసుకుంటూ పోతున్నాడు. దీంతో ప్రజలలో అసంతృప్తి నెలకొంటుంది అంటున్నారు. ఉద్యమకారులను పక్కనపెట్టి వివిధ పార్టీల నుండి వచ్చినవారికి ప్రాధాన్యత ఇవ్వడం, ఇతర పార్టీలలో గెలిచిన వారిని టీఆర్ఎస్ లో చేర్చుకోవడం, ఆందోళనలను అణచివేయడం, ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తివేయడం, విపక్షాలను లేకుండా చేయడం… ఎవరు తనకు ఎదురు చెప్పకూడదు అన్న ధోరణిలో వ్యవహరించడం, విమర్శలను సహించకపోవడం స్వీకరించకపోవడం నిరంకుశంగా వ్యవహరించడం చూసి ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.
మేము ఊహించిన కేసీఆర్ కి మేము చూస్తున్న కేసీఆర్ కి పోలికే లేదు అంటున్నారు. ఇందుకోసమే అయితే తెలంగాణ వచ్చిన రాకపోయినా ఒకటే అంటున్నారు. తెలంగాణ వస్తే ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయితే మా బతుకులు మారతాయి అనుకున్నాం సామాజిక న్యాయం జరుగుతుంది అనుకున్నాం… కాని అవేమీ జరగడంలేదు. బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. తన సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారు. కీలక పదవులు వారి వారికే కట్టబెడుతున్నారు అని తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. దీంతో అన్ రెస్ట్ ఏర్పడుతుంది అంటున్నారు.
అటు సొంత పార్టీ క్యాడర్ లో ఇటు ఉద్యమకారులలో ప్రజలలో కూడా ఇది కనపడుతుంది. తాజాగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె సందర్భంగా కూడా కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు కార్మికులలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. నాడు సకలజనుల సమ్మెకు మద్దతు ఇవ్వడమే కాకుండా ఆయనే స్వయంగా సమ్మెను నడిపించాడు. ఇప్పుడు సమ్మెలే వద్దు అంటున్నాడు. నాడు ఆర్టీసీలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ పెట్టించిన కేసీఅర్ ఇప్పుడు యూనియన్ వద్దు అంటున్నాడు. ఉద్యమ సమయంలో కార్మికులకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తాను అన్న కేసీఅర్ ఇప్పుడు కార్మికులు చనిపోతున్నా… చలిచడంలేదు. మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
కార్మికులు కేసీఆర్ ని ఇంకా ఉద్యమ నాయకుడి గా చూస్తున్నారని అంటున్నారు. అయన దళితుడిని సీఎం చేస్తాను అని చేయనప్పుడు అందరికీ అర్థంకావాలి కాని ప్రజలు ఇంకా భ్రమలు పెట్టుకోవడం వలనే వారిలో అసహనం పెరుగుతుంది అంటున్నారు. ఆర్టీసీ కార్మికులు కూడా కేసీఅర్ మీద ఆశలు పెట్టుకొని చివరికి సమ్మెకు దిగేసరికి కేసీఅర్ అసలు స్వరూపం బయటపడింది. దీనితో కార్మికులు మనోధైర్యం కోల్పోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడడం లేదా గుండే పగిలి చావడం జరుగుతుంది అని విశ్లేషిస్తున్నారు. కేసీఅర్ తెలంగాణ రాగానే ఇకనుండి నేను ఉద్యమ నాయకుడిని కాదు మా పార్టీ ఉద్యమ పార్టీ కాదు అని తేల్చి చెప్పాడు కాని ప్రజలు మాత్రం ఆయన మీద భ్రమలు పెంచుకొని మోసపోయారు అంటున్నారు.
ఇప్పటికైనా ప్రజలు కేసీఅర్ తెలంగాణ రాగానే చేసిన ప్రకటనను అర్దం చేసుకొని నడుచుకోవాలని బ్రమలను తొలగించుకోవాలని అంటున్నారు. లేకపోతే అనవసరంగా నష్టపోతారు అని హితవు చెప్తున్నారు. కేసీఆర్ చాలా స్పష్టంగా ఉన్నాడు, స్పష్టత లేనిది ప్రజలకే అని సెటైర్స్ వేస్తున్నారు