ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)
కర్నూలులో సబ్‌స్టేషన్ల ముట్టడి
at
కర్నూలు: విద్యుత్ కోతలపై జనం తిరగబడుతున్నారు. కర్నూలు జిల్లాలో శనివారం రాత్రి రెండు చోట్ల విద్యుత్ కోతలపై ప్రజలు ఆందోళనకు దిగారు. మంత్రాలయం మండలం కలుదేవకుంట వారం రోజులుగా రాత్రి పూట విద్యుత్ సరాఫరాను నిలిపివేస్తున్నారు. శనివారం ఆ ఊరి వారంతా ఏకమై విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అక్కడ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నాగరాజుతో వాగ్వాదానికి దిగారు. రాత్రి సమయంలో కరెంట్ తీసివేయడం వల్ల విష పురుగుల కాటుకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. డీఈ, ఏఈ వచ్చి సమాధానం చెప్పేవరకు వెళ్లే ప్రసక్తేలేదని కొద్దిసేపు అక్కడే బైఠాయించారు. తమ గ్రామానికి కరెంట్ లేకున్నప్పుడు మిగతా గ్రామాలకు కూడా ఉండకూడదంటూ కరెంట్ సరాఫరాను నిలిపివేశారు. దీంతో మంత్రాలయంతో పాటు పలు గ్రామాలకు గంట పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.