గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇంటికి సమీపంలో స్థానికులు ఆందోళనకు దిగారు. నిత్యవసర సరుకులు అందక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాజిటివ్ కేసు నమోదై 28 రోజుల గడువు ముగిసినందున… తమకు బయటకు వచ్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ పాత టోల్ గేట్ వద్ద మారుతి అపార్టుమెంట్ వాసులు ధర్నాకు దిగారు. ఆందోళన విరమించాలని పోలీసులు కోరటంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.