కరోనా వైరస్ ప్రభావం రోజు రోజుకు ఎంత పెరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం రెండు, మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 2లక్షల కొత్త కేసులు నమోదయ్యాయంటే కరోనా వైరస్ ఉదృతి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కరోనా ఉదృతిని అరికట్టాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి.
అయితే, ఏపీలోని చిత్తూరు జిల్లాలో లాక్ డౌన్ నిషేధాజ్ఞలు పాటించక… రోడ్లపై తిరుగుతున్న 13 మందికి చిత్తూరు జిల్లా పీలేరు కోర్టు జైలు శిక్ష వేసింది. పీలేరు పోలీసులు 13 మందిని ఐపీసీ 144 సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయగా, రెండు రోజుల జైలు శిక్షతో పాటు ఒక్కోక్కరికి వెయ్యి రూపాయల ఫైన్ విధించింది కోర్టు.
మరోవైపు పలమనేరులో కరోనా వైరస్ సోకిందని కొంతమంది యువకులు వాట్సాప్, ఫేస్ బుక్ లలో అసత్య ప్రచారం చేస్తుండటంతో వారిపై కూడా ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు.