గులాబ్ తుపాను ప్రభావంతో తెలంగాణ అంతటా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ను ముసురు కమ్మేసింది. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. అయితే కరోనా వ్యాక్సిన్ కోసం ఒక్కసారిగా జనాలు ఎగబడ్డారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. వ్యాక్సింగ్ కోసం క్యూలైన్ లో నిలబడ్డారు. కూకట్ పల్లి ఆస్బెస్టాస్ కాలనీలోని బస్తీ దవాఖానలో కనిపించింది ఈ సంఘటన. కోవిడ్ వాక్సిన్ కోసం వర్షంలో తడుస్తూనే బారులు తీరారు ప్రజలు. గొడుగులు పట్టుకుని క్యూలైన్ లో నిలబడ్డారు. అయితే వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర సరైన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు.