ఆ పాట ప్రభుత్వాన్ని ప్రశ్నించటం కాదు… బుల్లెట్ కన్నా వేగంగా తొలిచి వేసేది. ఆ ఆట ప్రభుత్వాన్ని గడగడలాడించేది. ఆ పేరు పాలకుల గుండెళ్లో రైల్లు పరుగెత్తించేది. కానీ అది గతం. ఆ పాట ఇప్పుడు మూగబోయింది. ప్రభుత్వాల ముందు మోకరిల్లింది.
అవును… ప్రజా గాయకుడిగా ప్రజలు సొంత అన్నలా భావించిన గద్దరన్న గురించే ఇదంతా. పాటనై వస్తున్నాననే గద్దరన్న, ఆటనై పలుకరిస్తానని చెప్పే గద్దరన్నా… ఇప్పుడిక విఠల్‌రావుగా మారబోతున్నారు. అందుకే ఓ సాదారణ కవిగా ప్రభుత్వానికి భజన చేసే నాకో ఉద్యోగం ఇవ్వండి అంటూ దరఖాస్తు చేసుకున్నారు.
డ్రంకన్ డ్రైవ్ ఆపండి మహిళలను కాపాడండి
నేను ఓ కళాకారుడిని, నా దగ్గర అది నిరూపించుకునే ఎలాంటి సాక్షాలు, సర్టిఫికేట్లు లేవు… చిన్నప్పటి నుండే ప్రజల పాటలను పాడుతున్నా. రాయటం-పాడటం-ఆడటం నా వృత్తి. నన్ను కళాకారుడిగా గుర్తించండి అంటూ తెలంగాణ సాంస్కృతిక శాఖకు దరఖాస్తు చేసుకున్నారు గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ రావు.
రాష్ట్రంలో భూసేకరణ వ్యతిరేక పోరాటాలు, కార్మికోద్యమాలు జరుగుతుంటే… తన పాటతో ఉద్యమానికి ఊపిరిలూదాల్సిన గద్దర్, నన్ను కళాకారుడిగా గుర్తించండి అని ప్రభుత్వాన్ని వేడుకోవటం బాధేస్తోందని, ఆయన వెన్నులో ఉన్న తూటా అయినా గద్దరన్నకు పాశవిక ప్రభుత్వాల పంచన చేరొద్దన్న విషయాన్ని గుర్తుచేస్తలేదా అని ప్రజా సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.