ఉత్తరప్రదేశ్, బస్తి జిల్లాలోని కైలీలో దారుణం చోటు చేసుకుంది. 24 ఏళ్ల తర్వాత ఓ లిఫ్ట్ ఓపెన్ చేయగా అక్కడ కనిపించిన దృశ్యం అందరి ఒళ్ళు గగుర్పొడిచేలా చేసింది. అసలేం జరిగిందంటే…1991లో ఉత్తరప్రదేశ్లోని 500 పడకల ఓపెక్ అని ఆసుపత్రి నిర్మాణం జరిగింది. అందులో 1997 వరకు లిఫ్ట్ పని చేసింది. ఆ తర్వాత లిఫ్ట్ కరాబ్ అయింది. అయితే తాజాగా ఆ లిఫ్ట్ ఓపెన్ చేసిన వ్యక్తులకు అందులో ఆస్తి పంజరం కనిపించింది. షాక్ అయిన ఆ వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఆస్తి పంజరం ఫోరెన్సిక్ విభాగానికి పంపించి ఈ రహస్యాన్ని ఛేదించిన పనిలో పడ్డారు. దానికి సంబంధించిన డిఎన్ఏ పరీక్ష జరుగుతోంది.ఈ కేసులో పోలీసులు 24 సంవత్సరాల క్రితం మిస్సైన వ్యక్తుల జాబితాను పరిశీలిస్తున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడానికి జిల్లాలోని 24 పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులను తిరిగేస్తున్నారు.
ఆ వ్యక్తి లిఫ్ట్ లో ఇరుక్కుని ఊపిరాడక చనిపోయాడా లేదంటే ఎవరైనా అతన్ని చంపి అక్కడ దాచారా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ వ్యక్తి ఎవరు? ఎలా చనిపోయాడు? అశోక్ ఎన్ని సంవత్సరాలు కాల్ లిఫ్ట్ లో ఉంది? అనే విషయాలు ఇంకా తెలియ రాలేదు. త్వరలోనే ఈ కేసును సస్పెన్స్ ను తేలుస్తామని పోలీసులు చెబుతున్నారు.