హైదరాబాద్: జారీ చేసినవి లక్ష ఏడూ వేల జీవోలు, కానీ వాటిల్లో 42,500 మిస్ అయ్యాయి! ప్రభుత్వం జారీ చేసే జీవోలను వెబ్సైటులలో పొందుపరచాలి. కానీ, నిబంధనలకు విరుద్ధంగా, విడుదలైన జీవోలలో దాదాపు సగం వరకు వెబ్సైట్‌లలో పెట్టడం లేదని తెలంగాణ హైకోర్టులో ఒక పిల్ దాఖలయింది.
పిల్ దాఖలు చేసిన పేరాల శేఖర్ ప్రభుత్వం జారీ చేసే జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ జరిపిన హైకోర్ట్, తెలంగాణ చీఫ్ సెక్రెటరీ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు.