ఋతుస్రావం అనేది మహిళలకు కాస్త ఇబ్బందికర విషయం. అందులో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళు మాత్రం చాలా సంతోషంగా భరిస్తూ ఉంటారు. ఇక ఋతుస్రావం విషయానికి వస్తే మనుషుల్లో మాత్రమే కాదు జంతువులకు కూడా ఉంటుంది. స్త్రీలలో, పీరియడ్స్ ద్వారా అవాంఛిత కణజాలాన్ని విడుదల అవుతుంది. ప్రతి నెల కూడా స్త్రీల శరీరం గర్భం కోసం సిద్దంగా ఉంటుంది.

ఫలదీకరణం చేసిన గుడ్డును పోషించడానికి గానూ గర్భాశయం లైనింగ్ మందంగా ఉంటే అది జరగకపోతే లైనింగ్ పీరియడ్స్ లో బయటకు వస్తుంది. ఋతుస్రావం ద్వారా బయటకు పంపబడుతుంది. చాలా ఆడ క్షీరదాలు లేదంటే పిల్లలకు పాలిచ్చి పెంచే జీవులన్నిటిలో ఈస్ట్రస్ సైకిల్‌ను కలిగి ఉంటాయి. మానవులతో పాటు… కేవలం పది ప్రైమేట్ జాతులు అలాగే నాలుగు గబ్బిలాలు జాతులు, ఏనుగు ష్రూ మరియు ఒక జాతి స్పైనీ మౌస్ లకు మాత్రమే ఋతుస్రావం ఉంటుంది.

గొరిల్లాలు, చింపాంజీలు, కోతులు, ఒరంగుటాన్ల లాంటి ప్రైమేట్లు అంటే మొదటి తరం మానవులకు ఋతుస్రావం అవుతుంది. మిగిలిన జంతువులకు ఎందుకు ఉండదు అంటే… ఇతర జంతువులు గర్భాశయంలోని లోపలి పొరను తొలగించకుండా ఆ పొరను శరీరంలో పీల్చుకోవడం జరుగుతుంది. వాటికి లైనింగ్ పలుచగా ఉండటంతో శరీరంలోకి వెళ్ళిపోతుంది.
Also Read: లడఖ్ లో ఏ సిమ్ కార్డు పని చేస్తుంది…? ఏ టైం లో వెళ్తే మంచిది…?