ఐక్య రాజ్య సమితి వేదికగా జమ్ము కశ్మీర్ పై పాక్ చేసిన వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. పాక్ చేస్తున్న ద్వేషపూరిత వ్యాఖ్యలకు తాము స్పందించాల్సిన అవసరం లేదని భారత్ పేర్కొంది. పాక్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవంటూ భారత్ కొట్టి పడేసింది.
ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచికా కాంబోజ్ మాట్లాడుతూ.. భారత్ పై పాక్ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందన్నారు. వాటిని రాజకీయ ప్రేరేపిత ఆరోపణలుగా ఆమె అభివర్ణించారు. అవన్నీ పనికిమాలిన ఆరోపణలు అంటూ ఆమె ఫైర్ అయ్యారు.
అవన్నీ అసత్య ప్రచారాలనీ, వాటికి ప్రతిస్పందించడం కూడా వృథా అని ఆమె కొట్టి పడేశారు. భారత్ ఎల్లప్పుడూ మహిళల, శాంతి, భద్రత ఎంజెడాపైనే దృష్టిపెడుతుందని వివరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మొజాంబిక్ ప్రెసిడెన్సీలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో పాక్ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది.
కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఎప్పుడు భారత భూభాగాలే అని ఆమె స్పష్టం చేశారు. అవి భారత్ లో అంతర్భాగంగా వున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని పాక్ కు భారత్ చెప్పిందన్నారు. పొరుగు దేశం పాక్‌తో భారత్ సాధారణ సంబంధాలనే కోరుకుంటోందన్నారు. కానీ ఉగ్రవాదం లేని స్థితిలోనే మాత్రమే అది సాధ్యమవుతున్నారు.