బందరు కాంట్రాక్టు వర్కు టెండర్లలో అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర చేసిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు మంత్రి పేర్ని నాని .కాంట్రాక్టు పనులలో అవినీతి జరిగిందని, అందులో వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని నిరూపిస్తే ప్రాణం తీసుకుంటానన్నారు నాని. పరువు కోసం బతికే మనిషిని నేను. 2015లో రెండు కోట్లు రూపాయలు , 2016లో 3 కోట్లు రూపాయలు నిధులు వస్తే ,పనులకు టెండర్లు పిలిచి రద్దు చేసి పనులు చేయకుండా మామ అల్లుళ్ళు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 19 కోట్లు రూపాయలు మంజూరు అయ్యాయి. 2015-16 మిగులు నిధులు 5 కోట్లు కలిపి టెండర్లకు పిలిచి పనులు ప్రారంభించాము. స్థానిక మాజీ మంత్రి చాలా ఎక్కువ మాటలు మాట్లాడుతున్నారు.
ప్రస్తుతం 6.50 కోట్లు తో డ్రైనులు పనులు సాగుతున్నాయి .25 కోట్ల రూపాయలు కాంట్రాక్టు పనులు ఒకే ఒక్క కంట్రాక్టర్ కు అప్పచెప్పలేదని, ఆన్లైన్లో టెండర్లు వేసుకున్న కాంట్రాక్టర్ లకు ఇచ్చి పనులు ప్రారంభించామని తెలిపారు. పేద పిల్లలు చదువుకునే బడుల్లో క్లాసు రూముల నిర్మాణాల నిమిత్తం ఒకొక్క క్లాసురూముకి 25 వేలు లంచం తినమరిగిన మామ అల్లుళ్ళు పేర్ని నానిపై ఆరోపణలు చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పచ్చకామెర్లు ఉన్నవాడికి ఊరంతా పచ్చగా కనిపించినట్లు అవినీతిలో కూరుకుపోయిన మామా అల్లుళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు.