మోహన్ బాబు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళానన్నారు మంత్రి పేర్ని నాని. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మీడియా ముందుకు వచ్చిన పేర్నినాని మోహన్ బాబు కాఫీకి ఆహ్వానించారని అందుకే ఇంటికి వెళ్లాను అని చెప్పారు. సినిమా వాళ్ళు పరిష్కారం లభించిందని ఆనందం వ్యక్తం చేస్తే బాబు విమర్శలు చేస్తున్నారని అన్నారు.
నిన్న చంద్రబాబు మీటింగ్ కి వచ్చాడా ఏంటి? అంటూ ప్రశ్నించారు. లేదంటే చిరంజీవి, మహేష్ బాబు కుర్చీల కింద కింద కూర్చున్నాడా అంటూ కౌంటర్ ఇచ్చారు.
మహేష్ బాబు, చిరంజీవి, ప్రభాస్, ఆర్ నారాయణమూర్తి లకు వైసిపి పార్టీ సభ్యత్వాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. అలాగే నేను చెప్పిన తర్వాతే విష్ణు ట్వీట్ అప్డేట్ చేశారని అన్నారు.
ఎవరెవరో ట్వీట్లు చేస్తే నాకేంటి సంబంధం అంటూ మండిపడ్డారు. సినిమా వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు చేసింది ఏంటని అడిగారు. సినిమా వాళ్లను రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు వాడుకున్నాడని అన్నారు పేర్ని.