పేర్ని నాని, మాజీ మంత్రి
విషపు రాతలతో చంద్రబాబు ఒక పుస్తకం అచ్చు వేయించారు. ఆ పుస్తకం మీద తన పేరు కూడా వేసుకోలేని పిరికిపంద ఆయన. పుస్తకంపై ఎక్కడా టీడీపీ పేరు లేదు. అసత్యపు రాతలు కాబట్టే.. పేరు వేసుకునే ధైర్యం చేయలేదు. అచ్చెన్నాయుడికి బాడీ తప్ప బుర్ర ఉండదు. చంద్రబాబు ప్రభుత్వంలోనే వైఎస్ వివేకా హత్య జరిగింది. ఆయన కూతురు స్టేట్ మెంట్ ఎందుకు తీసుకోలేదు. వివేకా భార్య, అల్లుడిని ఎందుకు విచారించలేదు అప్పుడు మీ ప్రభుత్వం ఉండి ఏం చేశారు బాబూ..?
వివేకా కూతురు సందేహాలపై ఎందుకు విచారణ లేదు. ఆయన హత్యపై టీడీపీ ప్రభుత్వంలో ఎందుకు చార్జ్ షీట్ వేయలేదు. సీబీఐకి అవినాష్ రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చారని.. చంద్రబాబు ఎలా చెబుతారు. ఎన్టీఆర్ మరణం మీద లక్ష్మీ పార్వతి విచారణ కోరితే.. ఆయన ఎందుకు విచారణకు ఆదేశించలేదు. ఎన్టీఆర్ మరణం మీద కూడా పుస్తకం రాయాలి కదా. ఎందుకు రాయలేదు. సీబీఐకి అవినాష్ ఇచ్చిన స్టేట్ మెంట్.. ఎల్లోస్ కు ఎలా వచ్చింది. కోడెల శివ ప్రసాద్ ఫోన్ తెలంగాణ పోలీసులకు ఎందుకివ్వలేదు.
చంద్రబాబు దుర్మార్గపు రాజకీయ క్రీడలో తాను బలైనట్లు.. కోడెల ఫోన్ లో రికార్డు చేశారా? ఎందుకు ఆయన ఫోన్ ధ్వంసం చేశారు. కోడెల మరణంపై సీబీఐ విచారణ ఎందుకు అడగలేదు. ఆ మరణంపై చంద్రబాబు పుస్తకం ఎందుకు వేయలేదు. నందమూరి ఆడపడుచు ఈమధ్య ఉరి వేసుకుని చనిపోయారు. దానిమీద పుస్తకం ఎందుకు వేయలేదు. వైఎస్ వివేకా భార్యను, కూతుర్ని, అల్లుడిని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు విచారించలేదు. ఆ పుస్తకంలో భారతి ఫొటో ఎలా వేస్తారు. ఇంత నీచానికి ఎందుకు దిగజారుతున్నావు చంద్రబాబు.
మీ ఇంట్లో ఆడవాళ్లే ఆడవాళ్లు.. మిగతా కుటుంబాల్లో వాళ్లు కాదా? ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ ను దెబ్బ తీయలేరు. వివేకా హత్యపై చార్జ్ షీట్ ఎందుకు వేయలేదు. చంద్రబాబు ప్రభుత్వం చేతగాని ప్రభుత్వమా? సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా నిషేధించింది మీరు కాదా? చంద్రబాబు అంత నీచుడు ఎక్కడా ఉండరు. ఎన్నికల కోడ్ లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగదా? టీడీపీ నేతలకు పబ్లిసిటీ పిచ్చి. ఎల్లో బ్యాచ్ దుర్మార్గమైన రాజకీయ క్రీడ ఆడుతోంది. ఎన్టీఆర్ మీద కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు మీద పుస్తకం రాయాలి.