టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల తదితరులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన సంగతి తెలిసిందే. గురువారం చిరంజీవి భేటీ కాగా శుక్రవారం మోహన్ బాబును కలిశారు మంత్రి పేర్ని నాని.
ఈ ఇద్దరూ కూడా సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం మచిలీపట్నం బయల్దేరి వెళ్లారు నాని.ఇదే విషయాన్ని చెబుతూ ట్వీట్ చేశారు మా అధ్యక్షుడు మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్లాన్ వివరించారని, సీఎంతో చర్చల సారాంశాన్ని కూడా నాని చెప్పినట్లు చెప్పుకొచ్చారు.
టికెట్ ధరల విషయంలో కూడా జరిగిన చర్చ గురించి వివరించారని విష్ణు తెలిపారు. అయితే నిన్న మెగాస్టార్ చిరంజీవి జగన్ ను కలవగా ఈరోజు పేర్ని నాని మోహన్ బాబు ను కలవటం ఆసక్తికరంగా మారింది.
ఇక మా అసోసియేషన్ ఎన్నికల్లో కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేయడం ప్రకాష్ రాజ్ ఓడిపోటం కేసుల జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ రెండు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది.
Advertisements
https://twitter.com/iVishnuManchu/status/1492065441853837314?s=20&t=C0-blgstPlQ9-lLQ0bX6vQ