ఆన్ లైన్ లో సినిమా టికెట్ల అమ్మకానికి ఫిలించాంబర్ ప్రతినిధులు, నిర్మాతలు ఓకే చెప్పారని తెలిపారు మంత్రి పేర్ని నాని. ఎగ్జిబిటర్స్, సినీ ప్రముఖులతో పేర్ని సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎగ్జిబిటర్ల ఇబ్బందులు.. షూటింగ్ సమయంలో నిర్మాతల సౌలభ్యాలు సహా పలు సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. అన్నింటినీ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు పేర్ని.
ఆన్ లైన్ టికెటింగ్ విధానంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరలే ఉంటాయని తెలిపారు పేర్ని నాని. ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కోరినట్లు వివరించారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి మంచి నిర్ణయాలే తీసుకుంటామని స్పష్టం చేశారు.
నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ… ఆన్ లైన్ టికెట్ విధానాన్ని తామే అడిగామని చెప్పారు. అలాగే 12 గంటలలోపు 4 షోలు పూర్తి చేయడం, విద్యుత్ బిల్లుల అంశం, వంద శాతం ఆక్యుపెన్సీపై మంత్రితో చర్చించినట్లు తెలిపారు. ఇకపై బెనిఫిట్ షోలు అనేవి ఉండవన్న ఆయన… త్వరలోనే సీఎం జగన్ తో భేటీ అవుతామని చెప్పుకొచ్చారు.