పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ రిలీజ్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే వాటిపై స్పందిస్తూ…ట్విట్టర్ లో ట్వీట్ లు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.
తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే అంటూ వైసీపీ నేతల పై పవన్ కళ్యాణ్ ట్విట్ చేయగా…. దానికి కౌంటర్ పేర్ని నాని ట్వీట్ చేశారు. జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న’మస్కా’రాలు అంటూ పేర్ని నాని ట్వీట్ చేశారు. పవన్ ను వరాహం తో పోల్చడం తో పవన్ అభిమానులు పేర్ని నాని పై ట్వీట్ చేశారు.