గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. కాకాణి రోడ్డులో బీటెక్ విద్యార్థినిని ఓ యువకుడు కత్తితో పొడిచి చంపేశాడు. మృతురాలు ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది.
విషయం తెలిసి పోలీసులు హుటాహుటిన స్పాట్ కు చేరుకుని పరిశీలించారు. యువతి మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. హత్యచేసిన యువకుడి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటన నడిరోడ్డుపై జరగడంతో గుంటూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.