ప్రభుత్వాలు ఆడవారి మీద జరిగే అన్యాయాల కోసం ఎన్ని చట్టాలు, ఎన్ని శిక్షలు అమల్లోకి తీసుకుని వచ్చినప్పటికీ..నిత్యం ఏదోక మూల ఆడవారి మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా మృగాళ్లు రెచ్చిపోతున్నారు.
తాజాగా కూతురి స్నేహితురాలి మీద అత్యాచారయత్నం చేసిన ఓ వ్యక్తికి గ్రామస్తులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పజెప్పిన ఘటన శ్రీసత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చిలముత్తురు గ్రామానికి చెందిన శ్రీనివాసులు ఇంటి ముందు తన కుమార్తె ఆమె స్నేహితురాలు కలిసి ఆడుకుంటున్నారు. ఆ చిన్నారి మీద కన్నెసిన శ్రీనివాసులు ఆ పాపను బండి ఎక్కమనడంతో ఆ పాప ఎక్కింది.
గ్రామంలో ఎవరూ లేని ప్రదేశానికి తీసుకుని వెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బెదిరిపోయిన చిన్నారి గట్టిగా ఏడ్వడంతో అటుగా వెళ్తున్న కొందరూ గ్రామస్థులు విని ఘటనా స్థలానికి వచ్చారు.
ఆ కామాంధుడికి దేహశుద్ది చేసి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు. నిందితుడి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.