అనగనగా ఓ ఫ్రిడ్జ్… అందులో వృద్ధుడి శవం.. అక్కడ ఎందుకుందని ఆరా తీస్తే షాకింగ్ విషయం బయటపడింది. వరంగల్ జిల్లా పరకాలలో బాలయ్య అనే రిటైర్డ్ ఉద్యోగి మృతదేహాన్ని ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాడు ఆయన మనవడు నిఖిల్.
ఇలా ఎందుకు చేశావని అడిగితే అంత్యక్రియలకు డబ్బులు లేక చేయాల్సి వచ్చిందని సమాధానం ఇచ్చాడు. పైగా రెండు రోజుల క్రితమే చనిపోయాడని చెప్పాడు. అది విని షాకైన పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు.
ఈ ఘటన పరకాలలో కలకలం రేపింది. నిఖిలే హత్య చేసి ఫ్రిజ్ లో దాచి పెట్టాడా..? లేదంటే మరణించిన తర్వాత ఆర్థిక సమస్యల వల్లే ఉంచాడా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.