
కంటే కూతుర్ను కనాలంటారు.. ఏ తండ్రయినా కూతుర్నితన ఆరోప్రాణంగా ..ప్రేమగా పెంచుతాడు. అతను అంతే.పంచప్రాణాలతో కూతుర్ని పెంచి పెద్దచేశాడు. మంచిసంబంధం వచ్చిందని పెళ్లి చేశాడు.అల్లుడికి అడిగినంత కట్నం ఇచ్చాడు. కానీ పెళ్లాయిన కొన్నాళ్లే అల్లుడి అసలు రూపం బయటపడింది. కూతుర్ని వేధిస్తుంటే ఆ తండ్రి గుండె తల్లడిల్లింది. బిడ్డ కాపురం బాగుండాలని అల్లుడు అడిగినప్పుడల్లా అప్పుసప్పు చేసి డబ్బు సరిదాడు.కానీ అల్లుడి వైఖరి మారలేదు. ఆక్రమంలో కూతురు అత్తారింట్లో అనుమానాస్పదస్థితిలో చనిపోయింది.
తండ్రి తల్లడిల్లాడు.చూస్తుండగా ఏడాది గడిచిపోయింది. నాన్న మనసులో వేదన మాత్రం చల్లరలేదు. కన్నుతెరిచినా మూసినా..కూతురు రూపమే.మరోవైపు చూస్తే అల్లుడు దర్జాగాతిరుగుతున్నాడు.అంతని అతనిలో కోపం కట్టలు తెగింది. తన కూతురు మరణానికి అల్లుడే కారణమన్న కోపంతో ఓ నిర్ణయానికి వచ్చాడు. అదను కోసం వేచి చూడాడు. అల్లుడు కంటపడ్డాడో..మామ వెంటపడ్డాడో కానీ తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం డీజేపురంలో జరిగిన ఘటనతో అంతా ఉలిక్కిపడ్డాడు. అల్లుడిని హత్య చేశాడు మామ.అంతేకాదు