అప్పనంగా వచ్చినసొమ్ము..కోతికి కొబ్బరి చిప్ప దొరికనట్టైంది. తప్పతాగి అరుధంతి సినిమాలో పశుపతిలా చిత్రవిచిత్ర విన్యాసాలు చేసాడు. కట్ చేస్తే పోలీస్ స్టేషన్లో మొకాళ్ళ మీద కూర్చున్నాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని సిడ్కుల్ లో జరిగింది. ఆన్ లైన్ బెట్టింగ్ లో భారీగా డబ్బు రావడంతో ఆనందంతో తప్ప తాగి వీధుల్లో బీభత్సం సృష్టించాడు.
స్థానికులు ఆపినా..తాను సీఎం చుట్టమని చెప్పి దురుసుగా ప్రవర్తించాడు. వాడి వికృత చేష్టలకు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. సదరు వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. మహేష్ సింగ్ ధామి అనే వ్యక్తి డ్రీమ్ 11 యాప్‌లో రూ.కోటి బహుమతి గెలుచుకున్నాడు. ఈ ఆనందంలో మద్యం తాగి వీధుల్లోకి వచ్చి దురుసుగా ప్రవర్తించాడు. అతడిని ఆపేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ మాట వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
నిందితుడిని వారు అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో తాను ముఖ్యమంత్రికి బంధువునని చెబుతూ హెచ్చరించాడు. పోలీసుల యూనిఫాం విప్పమంటూ వికృత చేష్టలకు దిగాడు. చివరకు అతణ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.