ఎంత క్లోజ్ అయినా సరే.. విష సర్పం ముందు ఆటలొద్దు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. బీహార్ లోని సారన్ జిల్లా శీతల్‌పూర్ లో మన్మోహన్ అనే వ్యక్తి పాములు పెంచుతుంటాడు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తన చెల్లి సులోచన అతడికి రాఖీ కట్టింది. అయితే తాను పెంచుకుంటున్న రెండు పాములకు కూడా రాఖీ కట్టాలని పట్టుబట్టాడు మన్మోహన్. సరేనని అతడి చెల్లి ఓ పాముకు రాఖీ కడుతుండగా.. మరో పాము మన్మోహన్ ను కాటేసింది.
ఆ స్నేక్ విషం చాలా పవర్ ఫుల్ గా ఉందనుకుంట.. క్షణాల్లోనే కుప్పకూలాడు మన్మోహన్. అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు. ఆసుపత్రికి వెళ్లేలోపే చనిపోయాడు. చెల్లితో రాఖీ కట్టించుకున్న కాసేపటికే మన్మోహన్ చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.