మామూలుగా ఇంటిని రెంట్ కి ఇచ్చేటప్పుడు ఈ ఇల్లు రెంట్ కి ఇవ్వబడును అని ఇంటి బయట పెడుతూ ఉంటారు. అలాగే ఆ ఇల్లును అమ్మేటప్పుడు ఇల్లు అమ్మబడును అని బయట బోర్డు తగిలిస్తూ ఉంటారు. కానీ తాజాగా విశాఖలో చోటు చేసుకున్న ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వివరాల్లోకి వెళితే త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే రెండో విడత నామినేషన్ లు కూడా ముగిసాయి. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నంలోని వంటర్లపాలెంలో ఓ వ్యక్తి ఏర్పాటుచేసిన పోస్టర్ అందర్నీ ఆలోచింపజేసింది.
అసలు ఇంతకీ ఆ పోస్టర్ లో ఏముందని అనుకుంటున్నారా…మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు…అంటూ ఇంటి బయట సన్యాసయ్య దొర ఓ పోస్టర్ పెట్టాడు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ అమూల్యమైనదని తాము ఎప్పుడూ ఓట్లు అమ్ముకోలేదని తన ఇంట్లో ఉన్న ఓట్లను నిజాయితీ గల అభ్యర్థులకు వేస్తామని చెప్పుకొచ్చాడు. అయితే ఆయన పెట్టిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.