భారత విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోడీ అన్నారు. హవాయి చెప్పులు ధరించే వారు కూడా హవాయి జహాజ్(విమానం)లో ప్రయాణించాలన్నారు. అది ఇప్పుడు జరుగుతోందని, తాను చూస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
కర్ణాటకలోని శివమెగ్గ విమానాశ్రయాన్ని ఆయన ఈ రోజు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ….రాబోయే రోజుల్లో భారత్‌కు వేలాది విమానాలు అవసరమవుతాయని తెలిపారు. మేడ్ ఇన్ ఇండియా ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు.
2014కు ముందు ఎయిరిండియా పేరు ప్రతికూల కారణాలు, స్కామ్‌లతో ఎక్కువగా వినిపించేదన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ కు పదే పదే అవకాశం ఇవ్వాలని కర్ణాటక ప్రజలు నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. సుమారు 450 కోట్లతో కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు.
రాష్ట్రంలో ఆయన పలు అభివృద్ది పనులకు శంకు స్థాపన చేశారు. రూ. 215 కోట్లతో రెండు రైల్వే ప్రాజెక్టులు, బహుళ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులు, జల్ జీవన్ మిషన్ కింద రూ. 950 కోట్లతో పలు పథకాలను ఆయన ఈ రోజు ప్రారంభించారు