చిన్నప్పటి నుంచి చంటి పిల్లలా సాకిన మనిషిని చంపేసింది ఓ కంగారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వెలుగు చూసింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని రెడ్మాండ్లో నివశించే 77 ఏళ్ల వృద్ధుడు తీవ్రమైన గాయాలతో స్థానికుల కంటపడ్డాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని వృద్ధుడికి ప్రథమ చికిత్సఅందించేందుకు ప్రయత్నించారు.అయితే వాళ్లు అతన్ని చేరుకోకుండా కంగారూ అడ్డుపడింది.
దాంతో అధికారులు దాన్ని కాల్చి చంపేశారు. అనంతరం వృద్ధుడికి చికిత్స చేసినప్పటికీ అతను ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. కంగారూలు ఇంతలా దాడి చేసి ఒక మనిషిని చంపేయడం గత 86 ఏళ్లలో ఇదే తొలిసారని తెలుస్తోంది.
గతంలో అంటే 86 ఏళ్ల క్రితం రెండు కుక్కలను కంగారూ బారినుంచి తప్పించే క్రమంలో ఒక 38 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడి కన్నమూశాడు. మళ్లీ ఇలా కంగారూ దాడిలో వ్యక్తి మరణించడం ఇదే తొలిసారి.