గురుకులాల పీఈటీ అభ్యర్థులు హైదరాబాద్‌లోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతిభవన్ ను ముట్టడించారు. తాము అన్ని పరీక్షలు రాసి ఉద్యోగాలకు ఎంపికైనా నియామక పత్రాలు ఇవ్వడంలేదని అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
ఎంపికైనా 616 మంది అభ్యర్థులకు గురుకులాల్లో పీఈటీ పోస్టులకు నియామక పత్రాలు ఇవ్వాలని అభ్యర్థులు నిరసన తెలిపారు. వీటితో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పీఈటీ, పీడీ పోస్టులను భర్తీ చేసేందుకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రగతి భవన్ ను ముట్టడించిన అభ్యర్థులను అరెస్టు చేసిన పోలీసులు గోషామహల్ స్టేషన్‌కు తరలించారు.