విద్యార్థుల ఫెలోషిప్ మంజూరులో అక్రమాలు జరిగాయంటూ హైకోర్టులో పిల్ దాఖలయ్యింది. తెలంగాణలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు అయిన ఉస్మానియా యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీల్లో ఈ అక్రమాలు జరిగాయంటూ పీహెచ్డీ అభ్యర్థి కె.శ్రీనివాస్ వేసిన పిల్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
యూజీసీ మార్గదర్శకాలకు విరుద్ధంగా అనర్హులకు ఫెలోషిప్ లు మంజూరయ్యాయన్న పిటిషనర్ వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు… నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం, యూజీసీ, సీబీఐ, ఓయూ, కేయులకు నోటీసులు జారీ చేసింది. ఈ అక్రమాలను సీబీఐతో విచారించాలని పిటిషన్ కోరటంతో సీబీఐని కూడా రెస్పాండ్ కావాలని కోర్టు ఆదేశించింది.