ఎస్ఈసీగా పార్థసారథి నియామకం చట్టప్రకారం జరగలేదని న్యాయవాది సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ఆద్వర్యంలో గ్రేటర్ ఎన్నికలు, మేయర్ రిజర్వేషన్ సరైన పద్ధతిలో జరగలేదని పిటిషనర్ పేర్కొన్నారు.
న్యాయవాది పిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఎస్ఈసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.