తెలంగాణలో గవర్నర్ కోటాలో కొత్తగా ముగ్గురు ఎమ్మెల్సీల నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఎమ్మెల్సీలుగా గోరేటి వెంకన్న, దయానంద, సారయ్యలను నియమించడాన్ని సవాలు చేస్తూ ధన్ గోపాల్ అనే న్యాయవాది రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
రాజ్యాంగానికి విరుద్ధంగా ఎమ్మెల్సీ నియామకం చెప్పట్టారని పిటిషనర్ వాదించారు. ఈ పిటిషన్ ను విచారణకు చేపట్టిన న్యాయస్థానం… ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. చీఫ్ సెక్రటరీ, గోరేటి వెంకన్న సారయ్య, దయానంద్ లకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.