ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో తమ లక్ష్యాలను చేరుకోవడానికి హిజాబ్ వివాదాన్ని రాజకీయ పార్టీలు రేకెత్తిస్తు్న్నాయని, అందువల్ల కేసు విచారణను ఫిబ్రవరి 28వరకు వాయిదా వేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది.
‘ ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ లాంటి రాష్ట్రాల్లో రాజకీయ లబ్ది పొందేందుకు కొన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. దాని కోసం హిజాబ్ వివాదాన్ని వాడుకుంటున్నాయి” అని పిటిషనర్లు మహ్మద్ తాహీర్, అయేషా అల్మాస్ లు పేర్కొన్నారు.
‘ హిజాబ్ నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలేవైనా జరిగితే అది మత ఘర్షణలకు దారి తీస్తుంది. అందువల్ల హైకోర్టు ఈ విషయాలను పరిశీలించాలి అని కోరుతున్నాము” అని అన్నారు.
హిజాబ్ పై ఇటీవల హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను విడుదల చేసింది. రాష్ట్రంలో విద్యా సంస్థలను తెరవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతానికి విద్యార్థులంతా యూనిఫామ్ ధరించి మాత్రమే కాలేజీలకు రావాలని సూచించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు విద్యార్థుల ఎలాంటి మతపరమైన దుస్తులు ధరించకూడదని ఆదేశించింది.