గుంటూరు: ఏబీఎన్, టీవీ5 చానెళ్ల ప్రసారాలు బ్యాన్ చేయడంపై హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలయ్యింది. గుంటూరు జిల్లా దాచేపల్లికి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన కాడుమంచి వెంకటేష్ తరుపున న్యాయవాది అంబటి సుధాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో ఈ కేసుపై విచారణ చేపట్టి, ఈ నెల 27కు వాయిదా వేశారు. ఏబీఎన్, టీవీ5 చానెళ్లు నిలుపుదల చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని న్యాయవాది వాదించారు. న్యూస్ చానెల్స్‌ను బ్యాన్ చేయడం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ను కాలరాయడమేనని చెప్పారు. పిటిషన్ తరపున వాదనలు విన్న హైకోర్ట్, కేంద్ర ప్రభుత్వం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు, టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. వీటితోపాటు పలు కేబుల్ నెట్ వర్క్, ఎంఎస్ఓలకు నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది.