గత శుక్రవారం దేశ వ్యాప్తంగా చెలరేగిన హింసాకాండను నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్, దాని యువజన విభాగం అయిన బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. హిందువులపై దాడులు జరుపుతూ.. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న దుష్ఠశక్తులకు శిక్షించాలని నినదించారు.
కుట్ర పూరితంగా హిందువులపై దాడులు జరుపుతూ.. దేశ ప్రతిష్టను దెబ్బతీస్తున్న జిహాదీ మూకలపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందులో భాగంగా ప్రతి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేపట్టింది.
ఈ మేరకు మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నగరానికి చెందిన వీహెచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు మెమోరాండం సమర్పించారు.
Advertisements
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బజరంగ్ దళ్ కో కన్వీనర్ జీవన్, సికింద్రబాద్ విభాగ్ కన్వీనర్ శ్రీకాంత్, వీహెచ్పీ జిల్లా కార్యదర్శులు స్వామి, రజినీకాంత్, యోగానందరాజు, సహా కార్యదర్శి ఆశిష్, జిల్లా బజరంగ్ దళ్ కన్వీనర్లు సుమంత్ పలువురు స్థానిక హిందూ సంఘాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.