చమురు కంపెనీలు వాహనదారులని చావగొడుతూనే ఉన్నాయి. వరుసగా ఆరో రోజూ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్ పై 29 పైసలు.. డీజిల్‌పై 32 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఓవరాల్ గా 34 పైసల వరకు బాదేశాయి.
పెరిగిన ధరలతో ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ. 95.21కి ఎగబాకింది. డీజిల్ రూ.86.04కు చేరిందిది. ఇక హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌పై 30 పైసలు.. డీజిల్‌పై 34 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.92.26, డీజిల్ రూ.86.23కి చేరింది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.88.73, డీజిల్ రూ. 79.06కు చేరాయి.
గత ఆరు రోజుల్ వ్యవధిలో లీటర్ పెట్రోల్‌పై రూ.1.81, డీజిల్‌పై రూ.1.90 ధర పెరిగింది. ఈ పెంపు ఇలాగే కొనసాగితే ఈ నెలలోనే సెంచరీ కొట్టడం ఖాయం అంటున్నారు నిపుణులు.