దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు 80పైసలను దేశీయ చమురు కంపెనీలు బుధవారం పెంచాయి.
తాజా పెంపుతో దేశ రాజధాని న్యూ ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 97.01లకు చేరింది. డీజిల్ ధర లీటర్ ధర రూ. 88.27గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు 85 పైసలను చమురు కంపెనీలు పెంచాయి. దీంతో ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.67లకు, డీజిల్ ధర రూ. 95.85కు చేరింది.
చెన్నయ్ లో పెట్రోల్, డీజిల్ పై ధర 75 పైసలు పెరిగింది. పెట్రోల్ ధర రూ. 102.91కు చేరగా, డీజిల్ ధర రూ. 92.95గా ఉంది. కోల్ కతాలో పెట్రోల్ పై 83 పైసలు, డీజిల్ పై 80పైసలు పెరిగి రూ. 106.34, రూ. 91.42కు పెరిగాయి.