దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. గురువారం ఒక్క రోజు విరామం తర్వాత మరోసారి పెట్రోల్, డీజిల్ రేట్లను చమురు కంపెనీలు పెంచాయి. తాజాగా శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు 80 పైసలు పెరిగాయి.
దేశ రాజధానిలో పెట్రోల్, డీజిల్ లపై 80పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.81లుగా ఉంది. డీజిల్ ధర లీటర్ కు రూ. 89.07 లకు చేరింది.
ముంబైలో పెట్రోల్ ధరపై 84పైసలు పెంచారు. దీంతో పెట్రోల్ ధర రూ. 112.51లకు పెరిగింది. డీజిల్ ధరపై 85 పైసలు పెరిగి 96.70లకు చేరుకుంది.
చెన్నయ్ లో పెట్రోల్, డీజిల్ ధరలపై 76 పైసలు పెరిగాయి. దీంతో మార్కెట్ లో పెట్రోల్ ధర రూ. 103.67, డీజిల్ ధర రూ. 93.71లకు పెరిగింది.
దేశంలో నాలుగు రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది మూడవ సారి కావడం గమనార్హం . ఇంధ్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ సీఎన్ జీ ధరను కిలోకు రూ. 1 పెంచింది. దీంతో ఢిల్లీలో సీఎన్ జీ ధర కిలో రూ. 59.01 అయింది.