దేశంలో పెట్రోల్ ధరల పెంపు కొనసాగుతోంది. తాజాగా ఆదివారం పెట్రోల్, డీజిల్ ధరలపై 80పైసలను చమురు కంపెనీలు పెంచాయి. దీంతో ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు రెండు వారాల్లో రూ.8 వరకు పెరిగాయి.
తాజా పెరుగుదలతో దేశ రాజధాని న్యూఢిల్లిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.61 నుంచి రూ. 103.41లకు చేరుకుంది. డీజిల్ ధర శనివారం రూ. 93.87గా ఉన్న ధర రూ. 94.67లకు పెరిగింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ పై 84పై పెంచడంతో ధర రూ.118.41గా ఉంది. డీజిల్ ధర 85పై పెరగడంతో రూ. 102.64ల కు చేరింది.
గత నాలుగున్నర నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది 11వ సారి. ఈ ఏడాదిలో గత నెల 22న మొదటి సారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు. ఇక అప్పటి నుంచి ధరల పెంపు కొనసాగుతోంది.
జెట్ ఫ్యూయెల్ ధరలు శుక్రవారం పెరిగాయి. వాటి ధరలను 2 శాతం చమురు కంపెనీలు పెంచాయి. ఈ ఏడాదిలో వీటి ధర పెరగడం ఇది ఏడవసారి కావడం గమనార్హం.