దేశంలో పెట్రోల్ మంటలు ఆగడం లేదు. గత రెండు వారాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 8.40 పెరిగాయంటేనే పెట్రోల్ ధరలు ఏ రేంజ్ లో పెరిగిపోతున్నాయో అర్థం అవుతోంది.
ఈ రెండు వారాల్లో పెట్రోల్ ధరలు పెంచడం ఇది 12వసారి. తాజాగా పెట్రోల్, డీజిల్ పై చమురు కంపెనీలు మరో 40పైసలు పెంచాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత ప్రియం అయ్యాయి.
దేశ రాజధానిలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ ధర రూ. 103.81 కు చేరింది. ఇది ఆదివారం రూ. 103.41గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 94.67 నుంచి రూ. 95.07కు చేరుకుంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర పై 42 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ. 118.83 గా ఉంది. డీజిల్ ధర 43పైసలు పెరగడంతో ధర రూ. 103.07లకు పెరిగింది. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గిస్తున్నాయి.