దేశంలో పెట్రో వడ్డన కొనసాగుతోంది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ పై 80 పై పెరిగాయి. దీంతో గత 9 రోజుల్లో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలపై మొత్తం రూ. 5.60లు పెరిగింది.
తాజా ధరలతో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 100.21 నుంచి రూ. 101.01లకు పెరిగింది. డీజిల్ ధర రూ. 91.47 నుంచి రూ. 92.27లకు చేరుకుంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.88 ఉండగా డీజిల్ ధర రూ.100.10 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 106.69, డీజిల్ ధర రూ. 96.76గా ఉంది.
వరుస పది రోజుల్లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది తొమ్మిదో సారి. జూన్ 2017లో రోజువారీ ధరల సవరణ అమలు చేసినప్పటి నుంచి ఎనిమిది రోజుల్లో ధరూ. 5.60 పెరగడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.