దేశంలో పెట్రోల్ బాదుడు కొనసాగుతోంది. వరుసగా ఆరోరోజు కూడా ధరలు పెరిగాయి. అయితే.. ఈసారి మాత్రం చమురు సంస్థలు కాస్త దయ చూపినట్లుగా కనిపిస్తోంది.
సోమవారం లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెంచాయి చమురు సంస్థలు. గత ఆరు రోజులుగా 50 పైసల నుంచి 70 పైసల మధ్య పెరుగుతూ రాగా.. తాజాగా 30 పైసలు పెరిగింది.
గత వారం రోజుల్లో పెట్రోల్ లీటర్ కు రూ.4 వరకు పెరిగినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.71, డీజిల్ రూ.99.07గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.114.19, డీజిల్ రూ. 98.50కి చేరింది.
ఇక చెన్నైలో పెట్రోల్ రూ.105.18, డీజిల్ రూ.95.33గా ఉంది. కోల్ కతాలో పెట్రోల్ రూ.108.85, డీజిల్ రూ.93.92కు పెరిగింది.