ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరి లోక్ సభలో మంగళవారం అన్నారు.
ఇతర దేశాల్లో పెరిగిన ధరల్లో కేవలం పదోవంతు మాత్రమే మన దేశంలో పెరిగినట్టు తెలిపారు. ఏప్రిల్ 2021- మార్చి 2022 మధ్య గ్యాసోలిన్(పెట్రోల్) ధరలు అమెరికాలో 50శాతానికి పైగా పెరిగినట్టు ఆయన వెల్లడించారు.
కెనడాలో గ్యాసోలిన్ ధరలు 52 శాతం పెరగ్గా, జర్మనీ 55శాతం, బ్రిటన్ లో55 శాతం, ఫ్రాన్స లో 50శాతం, స్పెయిన్ లో 58శాతం పెరిగినట్టు తెలిపారు. ఇది భారత్ లో కేవలం 5 శాతం పెరిగినట్టు పేర్కొన్నారు.
దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు మంగళవారం కూడా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై 80పైసలను చమురు కంపెనీలు పెంచాయి. గత 15 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 13 సార్లు పెరిగాయి.